Wednesday, July 27, 2011
Sunday, September 12, 2010
Saturday, September 11, 2010
REMEMBER YOU
"ఉందిలే నీకే ఒక ప్రియురాలు...
మరీ ఇంత ఇదేమిటి నీకు తన మీద?
ఎప్పుడూ తన కోసమేనా...
ఇంక వేరే ఎమ్ లేదా నీ జీవితంలో? అంటే ఎమ్ చెప్పగలను!
కాని చెప్పడానికి వేరొకటి ఉంది,
అది... "తనోచ్చింది!
ఎస్, మళ్ళీ తనోచ్చింది... హేమంతంలా, వెన్నలలా, నా కోసం.
ఎలా అంటే... ఒక సాయంత్రం, చాలా మామూలు సాయంత్రం,
తను లేని జీవితాన్ని భారంగా, ఈ జన్మకింతే అనుకుంటూ, గడిపేస్తుంటే,
అనుకోకుండా ఎవరో అమ్మాయి పలుకరించింది,
ఎవరో గుర్తే పట్టలేక పోయాను,
చాలా పెద్దది అయిపొయింది తన చెల్లెలు,
తనే గుర్తు పట్టింది,
ఒక్కసారిగా ఒక సంతోషం,
ఇన్నాళ్ళకి తన కోసం చెప్పే ఒక మనిషి కనిపించింది,
తను ఎలా వుందో, ఎమ్ చేస్తుందో తెలుసుకోవడం,
అదీ ఒక అర్ధ దశాబ్దం తరువాత సంతోషం కాదా!
వావ్! తను ఎలా వుందో, ఎక్కడ వుందో తెలిసింది ఇన్నాళ్ళకి.
తన చెల్లెలికి నా మొబైల్ నెంబర్ ఇచ్చాను,
ఆ క్షణం నుండీ ప్రతి క్షణం ఒక దీర్ఘ నిరీక్షణ.
ఎవరు ఫోన్ చేసినా తనే ఏమో అని ఆశగా చూడడం, ఫోన్ రానే లేదు,
"ఓహ్, తనకి నా మీద కొంచం కూడా లేదు,
ఇన్నాళ్ళు అయింది, ఇన్నేళ్ళు అయింది,
కనీసం నేనెలా ఉన్నానో తెలుసుకోవాలి అని కూడా అనిపించ లేదా?
ఓహ్ ఎంత దురదృష్టం నాది,
ఒక్క సారి తను ఫోన్ చేస్తే ఎంత బాగున్ను,
తను గొంతు ఒక్కసారి వింటే మళ్ళీ జీవితం మీద ఆశ కలుగుతుంది,
మరో పదేళ్ళు ఆ కొన్ని మాటలే జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికేయలేనా! అనుకున్నాను.
ఫోన్ రానే లేదు, నీలు (తన చెల్లెలు) అసలు నా నెంబర్ తనకి ఇచ్చిందా?
నేను నెంబర్ వ్రాసిన బుక్ ఎక్కడైనా పారేసుకుందా?
లేక.. తనకి నాతో మాట్లాడం ఇప్పటకీ ఇష్టం లేదా?
ఒక్క సారి మాట్లాడితే ఎంత బాగున్ను!
ఒక మధ్యాహ్నం నా మొబైల్ మోగితే...
తనని అనుకొనే లేదు, వారం అయింది,
తన దగ్గర నుండి ఇంక ఫోన్ రాదు అనుకున్నాను.
ఫోనులో ఎవరో అమ్మాయి వాయిస్,
ఎవరో నా పాత విద్యార్ధిని అయివుంటుంది అనుకుని "ఎవరూ? అన్నాను.
చాలా నెమ్మదిగా, శ్రావ్యంగా, సౌమ్యంగా, మార్ధవంగా తన మాటలు వినిపించాయి.
"నేనూ వినీలని"
నా చెవులు విన్న మాటలని నమ్మలేక మళ్ళీ అడిగాను,
"ఎవరూ? అని.
"నేనూ వినీలని"
మళ్ళీ అదే వాయిస్, నాకిష్టమైన, నా ప్రాణంలో ప్రాణం అయి బ్రతికిన తన వాయిస్,
ఓహ్, తన దగ్గర నుండీ ఫోన్, నిజమేనా? జీవితంలో మరి కనిపించదేమో అని ఉన్మత్తుడనైన
నన్ను మళ్ళీ మధుమాసంలోకి నెట్టిన వాయిస్.
Thursday, September 9, 2010
వాన
ఈ రోజు కూడా వానే. ముసురు పట్టి ఉంది.
ఆఫీసుకు వెళ్తున్నప్పుడు బాగా తడిచాను.
ఇలా తడవడం ఒక్కోసారి సంతోషం కలిగిస్తుంది...
జ్ఞాపకాలను కదిలిస్తుంది.
జ్ఞాపకాలను కదిలిస్తుంది.
ఏమిటా జ్ఞాపకం...?
ఆమే ఆ జ్ఞాపకం!
జ్ఞాపకం అననా...అందమైన అనుభవం అననా?
ఆమే ఆ జ్ఞాపకం!
జ్ఞాపకం అననా...అందమైన అనుభవం అననా?
ఒక జీవితానికి సరిపడేంత సంఘటనలని నాలో జ్ఞాపకాలను చేసి వెళ్ళిపోయింది అననా...,
నేనేవిధంగాను తనని నిర్వచించలేను,
కాని ప్రేమిస్తున్నానా...
కాని ప్రేమిస్తున్నానా...
అవునని... కాదని ... మనసు చేసే మాజిక్ నుండి ఎలా తప్పించుకోగలను!
హృదయం ఒక విలాప సంచిక...
వానలో తడిస్తే జ్ఞాపకాలు కూడా తడసి ముద్దవుతున్నాయి...
వానలో తడిస్తే జ్ఞాపకాలు కూడా తడసి ముద్దవుతున్నాయి...
ఏకాంతం... నిజంగా ఏకాంతం కాదు,
నేను ఒంటరిని కాను,
ఈ కురుస్తునే వున్న వాన లాగే
నేను ఒంటరిని కాను,
ఈ కురుస్తునే వున్న వాన లాగే
కన్నీళ్ళకి కూడా అంతం లేదు.
కంఠం దాటి ఉబకలేని దుఃఖం నా శాశ్వత నేస్తం...
కను కట్టలు దాటి దూక లేని కన్నీళ్లు
కను కట్టలు దాటి దూక లేని కన్నీళ్లు
నా ప్రియ సఖి నాకు మిగిలిచిన చుక్కల చంద్ర హారం!
అయినా ఇదంతా ప్రేమే!!!
ఈ... ప్రేమైక జీవనం నాకు బహు ప్రియం.
Saturday, September 4, 2010
14th Feb. 2007
| నా రాతలు... | |||||||||
| నా ప్రేయసి కోసం మొదలు పెట్టిన రాతలు... | |||||||||
| నా ప్రేయసి జ్ఞాపకాలను అక్షరాలతో చిత్రించి శాశ్వతం చేయాలనీ మొదలు పెట్టిన రాతలు... | |||||||||
| అన్నీ సంతోష పెట్టేవే కాదు, అన్నీ బాధ పెట్టేవే కాదు... కానీ అన్నీ ఇష్టమైనవి. | |||||||||
| తను పంచింది కొద్ది ప్రేమే అయినా, ఉన్నట్టుండి నన్ను వదిలి వెళ్ళిపోయినా, | |||||||||
| ఒక జీవితానికి సరిపడేన్ని మధుర స్మృతులను నాకు మిగిల్చి వెళ్ళింది, | |||||||||
| కొన్ని సంవత్సరాల వరకు నమ్మలేనంత నిజం తను నన్నోదలి వెళ్ళిపోవడం! | |||||||||
| నమ్మలేనివి అన్నీ నిజాలు కాకుండా పోతాయా... | |||||||||
| వద్దనుకున్నా...ఏమనుకున్నా...తను నాకు లేక పోవడం నిజం, కాని... | |||||||||
| ఎంత కష్టమైన నిజం. అలాంటి కష్టమైన నిజాన్ని జీర్నించుకుంటూ, | |||||||||
| జీవితాన్ని ఏదో విధంగా గడిపేస్తున్న రోజుల్లో ఒక స్నేహితురాలికి ఈమెయిలుతో పంచి పెట్టిన జ్ఞాపకమే ఇదంతా. | |||||||||
14th Feb. 2007 | |||||||||
| స్టేషన్ కి వెళ్ళాను, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని చెప్పను కదా, | |||||||||
| అలా చెప్పినా కూడా అసలు కారణం తను కనిపిస్తుంది ఏమో అని మాత్రమే కాదు, | |||||||||
| తను నేను ఒకసారి కూర్చున్న బెంచ్ మీద కూర్చోవాలి అని, అలా చేస్తే తనతో ఉన్నట్టే వుంటుంది, | |||||||||
| రైల్వే స్టేషన్ ఒక్కటే కాదు, నేను అలాగ చాలా చోట్లకి వెళ్తాను, | |||||||||
| మేము ఇద్దరం కలసి వెళ్ళిన ప్లేసెస్ చాలానే వున్నాయి వైజాగ్ లో, | |||||||||
| నీ వ్యూ లో ఇది అంతా ఓన్లీ కలసి తిరగడం లేదా జస్ట్ స్టుపిడిటి బట్... | |||||||||
| సమ్ టైమ్స్ ఆ స్టుపిడిటి కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది, | |||||||||
| నాకు ఏదో అయింది, | |||||||||
| మళ్లీ తను వస్తే కానీ మాములు అవ్వను ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి, | |||||||||
| ఇంకా... | |||||||||
| ఈ రోజు మార్నింగ్ ఒక కల వచ్చింది, | |||||||||
| " నేనూ నా ఫ్రెండ్ వస్తుంటే తను కనిపించింది, | |||||||||
| నేను వెంటనే వెళ్లి "ఎలా వున్నావు బంగారం? అని పిలిచాను. | |||||||||
| (నేను తనని అలాగే పిలిచే వాడిని, తనకు కూడా అలా పిలిస్తే చాలా ఇష్టం, ఎప్పుడైనా అలా పిలవక పొతే చాలా అలిగేది) | |||||||||
| ఫస్ట్ తను స్టన్ అయింది, థెన్ "బాగున్నాను, మీరు బాగున్నారా? అని అడిగింది, | |||||||||
| వాళ్ళ చెల్లి "ఇన్ని రోజులకి మీ కోరిక తీరింది కదా? అంది. | |||||||||
| (తనకి మాత్రమే మా స్టొరీ అంతా తెలుసు) | |||||||||
| ఒక రోజు నువ్వు అడిగావు కదా, "మీకు బాధ వుండదా? అని, | |||||||||
| నా బాధ ఎలాగా వుంటుందో ఆ రోజు చెప్పాలి అనుకుని చెప్ప లేదు, | |||||||||
| బట్ నిన్న కలలో కూడా అలాగే బాధ పడ్డాను, | |||||||||
| తను ఎప్పటిలాగే నవ్వుతూ మాట్లాడుతుంటే (ఇది అంతా డ్రీమ్ లో) నేను అలా చూస్తూ వుండి పోయాను, | |||||||||
| సడన్ గా నాకు ఒక డౌట్ వచ్చింది, నేను ఏడుస్తున్నాను ఏమో అని, | |||||||||
| కళ్ళు తడిమి చూసుకున్నాను బట్ కళ్ళ లో నీళ్ళు లేవు, బట్ గొంతు నిండా దుఖం ఉంది, | |||||||||
| చాలా కాలం తరువాత కలిసిన నా బంగారంతో మాట్లాడనీయకుండా చేస్తుంది, | |||||||||
| కళ్ళల్లో నీళ్ళు రావు, కానీ మనసు ఏడుస్తుంది, ఎవరికీ అర్ధం కాదు ఈ బాధ, | |||||||||
| చివరికి తనకి కూడా అర్ధం కాదు, చూసావా కల కూడా నాకు నచ్చినట్టు రాలేదు. | |||||||||
| "ఇంకా నేను ఫైవ్ మినిట్స్ యే మీతో మాట్లాడగలను, నేను వూరికి వెళ్ళాల్సిన బస్సు వస్తుంది" అన్నాది, | |||||||||
| నేను" అలాగే, నాకు ఏ ఆశా లేదు" అన్నాను. | |||||||||
| అన్నట్టు తను తన కొడుకుని చూపించింది, | |||||||||
| ఆ అబ్బాయి కోసం అడగగానే చాలా సంతోషంగా చాలా చెప్పింది, | |||||||||
| ఎలా మాట్లాడుతాడో, నవ్వుతాడో, ఏడుస్తాడో అన్నీ, | |||||||||
| ఎట్ లాస్ట్ తను వెళ్లిపోయింది, ఎప్పుడో 2 యియర్స్ బ్యాక్ మిస్ అయ్యాను తనని సేమ్ ఇదే ఫెబ్ 14న, | |||||||||
| ఇప్పుడు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వటం మిస్ కాలేదు ( ఐ మీన్ డ్రీమ్ లో) బట్ జీవితాన్ని మిస్ అయ్యాను. | |||||||||
| చాలా బోర్ కొట్టాను కదా, నాకు గొప్పవి అనిపించిన ఫీలింగ్స్ అందరికి అలాగే అనిపిస్తాయి అనుకోను, | |||||||||
| ఈవెనింగ్ నువ్వు అడిగావు కదా స్టేషన్ కోసం అందుకే ఇది అంతా చెప్పాలి అనిపించింది. | |||||||||
Wednesday, July 14, 2010
తనొస్తుందని...
చాలా వసంతాలు వెళ్లి పోయాయి,
వాటి వెనుకే గ్రీష్మాలు, తొలకరులు... వెళ్లి పోయాయి,
నేనిలాగే ఉండిపోయాను, తనొస్తుందని...,
వచ్చిందా?
తొలకరొచ్చింది.
నేనిలా తడుస్తూనే ఉన్నా!
తడుస్తూనే ఉన్నా తన జ్ఞాపకాలలో...
వస్తుందా మళ్ళీ?
ఏ శీతాకాలం సాయంత్రమో తన జ్ఞాపకం
మరీ మరీ బాధిస్తుంటే...,
ఎం చేయగలను?
నేనిలాగే ఉన్నాను...
నేనింకొలా ఉండగలనా!!!
Saturday, June 12, 2010
నా నేస్తాలే...
ఉదయం నిద్ర లేవగానే పలుకరించేవి నా నేస్తాలే...
వర్షా కాలం వచ్చేసింది, ఐనా వాటి ఉత్సాహం ఏమీ తగ్గ లేదు.
ఏ చెట్టు మీద నుండి అరుస్తుంటాయో కాని
వాటి అరుపులు ఎంతో ఇష్టం నాకు,
ఒకోసారి అవి నన్ను పలుకరిస్తున్నాయేమోనని
ఆశ్చర్యపోతాను, ఆశ పడతాను కూడా.
అయినా అవి నన్నేమి పిలువవు.
నేనలా చూస్తూనే వుంటాను, ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదికి
స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి.
చిన్న చిన్న రెక్కలు... చిన్న చిన్న నోళ్ళు... అయినా ఆనందం అంతా
వాటి వురుకులలోను, వాటి కిల కిలలలోనే ఉంది.
ఇలా చూస్తూ... ఎంత సేపైనా గడిపేయచ్చు, కాలం ఆగిపోవాలి అనిపిస్తుంది,
నన్నూ వాటి నేస్తంగా చేర్చుకుంటే ఎమ్మాట్లడుతాయి?
"చూడు ఇప్పుడు నేను ఎలా ఎగిరి ఆ పెద్ద కొమ్మ మీద వాలుతానో!
"లేదు, వాడు ఏమంత వేగంగా ఎగర లేడు, నన్ను చూడు క్షణాలలో ఎగిరి
ఆ కొత్త ఇంటి మీద ఎలా వాలుతానో!
"హే! నా అరుపులే తీయగా ఉన్నాయి కదా.. వీళ్ళు ఒప్పుకోవడం లేదు,
మా అమ్మే నాకు ఇలా నేర్పింది! అంటాయా.... అంటే ఎంత బాగుంటుంది!
వర్షం వెలసిపోతుంది... ఎండ కూడా వచ్చేస్తుంది... అపుడీ పక్షులన్నీ ఎటెగిరిపోతాయి?
మళ్ళీ మరునాడు తెళ్ళవారే వరకు వాటి కోసం ఎదురు చూడాలి.
అలా ఎదురు చూడడం నాకిష్టం... చాలా ఇష్టం!
Tuesday, March 30, 2010
చాలా ప్రేమించి... ప్రేమించబడి చివరికి!
ఒక్కోసారి అన్నీ బాధిస్తాయి...
ప్రేమించడం... ప్రేమించ లేక పోవడం...ఇంకా ప్రేమించబడక పోవడం,
అన్నీ విషాదమే.
నీ హృదయంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు ఇంకా
నీకెందుకు ఈ బాధ అంటే....
నీ హృదయంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు ఇంకా
నీకెందుకు ఈ బాధ అంటే....
ఎమ్ చెప్పగలను!
తనని కలసీ మాట్లాడి నెల రోజులు అయింది.
ఇదివరకటి నిరీక్షణ...,
తన మాటల్లో ఇదివరకు వినిపించే ప్రేమ ఇప్పుడు లేదు.
కారణం ఏమని ఊహించను?
తను మరెవరి ఆకర్షణలోనో పడిందేమో,
మరెవరో నన్ను మరిపించారేమో...
అని నాకనిపించడం అనుమానమా?
కాదు... చాలా ప్రేమించిన తరువాత కలిగే ఒక విషాదం!
అయినా సరే నన్నెవరైనా మరిపించేసినా సరే,
తనని కలసీ మాట్లాడి నెల రోజులు అయింది.
ఇదివరకటి నిరీక్షణ...,
తన మాటల్లో ఇదివరకు వినిపించే ప్రేమ ఇప్పుడు లేదు.
కారణం ఏమని ఊహించను?
తను మరెవరి ఆకర్షణలోనో పడిందేమో,
మరెవరో నన్ను మరిపించారేమో...
అని నాకనిపించడం అనుమానమా?
కాదు... చాలా ప్రేమించిన తరువాత కలిగే ఒక విషాదం!
అయినా సరే నన్నెవరైనా మరిపించేసినా సరే,
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, మన ప్రేమ సుమాలు ఇలా వాడిపోతున్నా...
అని తనకి ఎలా చెప్పగలను.
కోటానుకోట్ల జనంలో నాది ఏకాంతం,
అని తనకి ఎలా చెప్పగలను.
కోటానుకోట్ల జనంలో నాది ఏకాంతం,
ఏకాకితనం,
నాకు విహితమా?
చాలా ప్రేమించి,
నాకు విహితమా?
చాలా ప్రేమించి,
ప్రేమించబడి....
చివరికి
ఏ ప్రేమా లేకుండా బ్రతకడం ఎంత విషాదం,
ఉదయం తన ఫోటో చూసాను,
ఎప్పుడు తన చిరునవ్వు చూసినా కలిగే అదే ఉత్తేజం
మళ్ళీ కలిగింది.
కన్నీళ్ళూ... మీరు బయటకి రాకండమ్మా! అని దాచేసాను,
చాలా సందర్బాలలో చాలా సార్లు చేసినట్టుగానే.! మరొకసారి గుర్తు చేసుకోవాలి
ఈ అర్ధ రాత్రి తను ఉండి ఉంటే...
వెన్నల్లో సముద్రాన్ని...
ఆకాశంలో వెన్నెలకి అవతల మెరిసే నక్షత్రాలనీ...
నిశ్శబ్దంలో ఉండే మౌన రాగాన్ని...
తనకి అందించి ఉండే వాడిని కదా!
తన చేయి నా చేతిలో ఉండాలి...
తన తల నా భుజం మీద వాలాలి...
తను కళ్ళు మూసుకుని ఉంటే నేను లాలిస్తూ ఉండాలి...
కెరటాలు పాదాలను తాకి వెనక్కు వెళ్లిపోతు వుండాలి...
కాలం నిలిచి పోవాలి...
ఇంతే కదా ప్రేమంటే....
అడుగగానే తన చిన్న నాటి సంగతులు
సంతోషంగా చెప్పాలి...
నన్ను మొదటి సారి కలిసిన జ్ఞాపకంను
మరొకసారి గుర్తు చేసుకోవాలి...
చివరిగా మరీ చివరిగా,
తన హృదయంలో నేనెప్పటికీ
ఉండి పోవాలి!!!
పాత కవిత్వం

ఇప్పటి వరకు తనతో మాట్లాడుతుంటే కాలం తెలీలేదు,
వాళ్ళ నాన్న కోసం, తనకిష్టమైన వాటికోసం, ఇంకా ఏవేవో కబుర్లు...
తన హృదయంలో చాలా ప్రేమ ఉంది,
చివరికి ఆ ప్రేమ నాది అవుతుందా?
ఎప్పుడో చదివిన పాత కవిత్వం గుర్తుకొస్తోంది.
"నేనిక్కడే నీ ద్వారం దగ్గిర నీ కోసం
నిరీక్షిస్తున్నాను.
నువ్వెప్పటికైనా తలుపులు తెరచి
నన్ను నీ హృదయంలోకి
ఆహ్వానిస్తావని,
రోజులు క్షణాలుగా గడుస్తున్నాయి.
నీ ప్రేమ నీ దగ్గిరే ఉంది..,
నా ప్రేమ నా దగ్గిరే ఉంది.
మనం ఎప్పుడు ఒకటి అవుతాం!
Saturday, March 27, 2010
నా రాతలు.......
నా రాతలన్నీ ఉత్త నీటి మీద రాతలు,
రాస్తున్నంతసేపు ఎమ్ రాస్తున్నాన్నో చూడనే లేదు,
నీటిలో మెరుస్తున్న చందమామనే చూస్తుండి పోయాను,
నాకన్నీ ఉన్నాయి, నీటిలోను చందమామ...తలెత్తి చూసినా చందమామ!
చల్ల గాలి... పిల్ల గాలి... వెన్నల రాత్రి... వెన్నల్లో మెరిసే కొబ్బరాకులు... మంచు బిందువులు...,
నాకన్నీ ఉన్నాయి, వెన్నల్లో మెరిసే సముద్రం...
పాదాలు వెనక్కు లాక్కున్నా ఉండుండి ఇష్టంగా తాకి పోయే కెరటాలు కూడా నావే...
రాత్రే జామునో మెలకువ వస్తే చుట్టెవ్వరు లేకున్నా,
ఓయ్... మేమున్నాం కదా అంటూ పలకరించే జ్ఞాపకాలూ ఉన్నాయి,
కానీ నా రాతలు ఉత్త నీటి మీద రాతలు...
రాతల నీటిని దోసిట్లో తీసుకుని నాకు నేనే ముఖం మీద జల్లుకుంటున్నా...
అమృతమేమీ కాదు... ఉత్త నీళ్ళే! నా రాతలన్నీ నీళ్ళ రాతలే,
రాతలన్నిటిలో నేనున్నాను... నా వాళ్ళూ ఉన్నారు,
నే ఋణం తీర్చుకో లేక పోయిన నాన్నా ఉన్నాడు,
నవ్వులూ... ముద్దులు... కన్నీళ్లు మనకొక్కటే అంటూ బ్రతికి కాదని వెళ్ళిపోయిన ప్రేయసీ ఉంది...
అయినా నా రాతలు నాకిష్టం... చాలా ఇష్టం, అవి జ్ఞాపకాలు, నా జీవితం...
నా రాతలు చివరికి ఉత్త నీటి మీద రాతలు !
Subscribe to:
Posts (Atom)





